బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో అన్నదాతలు అప్రమత్తమయ్యారు. శుక్రవారం ఆకాశం మేఘావృతమవటంతో పాటు అశ్వారావుపేట మండలంలో చిన్నపాటి జల్లులు కురిశాయి. వరి కోతలు పూర్తిచేసుకుని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రాల్లోని వడ్ల రాసులకు పరదాలు కప్పారు.