రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. వరంగల్ డిక్లరేషన్లో భాగంగా సన్న వడ్లకు రూ. 500 బోనస్ అందజేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. దళారులు నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు.