మావోయిస్టులు కుట్రను ఛేదించిన గడ్చిరోలి పోలీసులు
మావోయిస్టులు కుట్రను గడ్చిరోలి పోలీసులు ఛేదించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విధ్వంసం సృష్టించేందుకు మావోల ప్లాన్ చేశారు. పార్లకోట నదిపై బామ్రఘడ్-తాడ్గన్ మధ్య బ్రిడ్జిని పేల్చేందుకు మందుపాతరలు అమర్చారు. విషయం పసిగట్టిన పోలీసులు.. బాంబ్ స్క్వాడ్ బృందంతో వాటిని నిర్వీర్యం చేశారు. మావోయిస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.