ఖమ్మం రోడ్, భద్రాచలం రోడ్, రింగ్ రోడ్‌లో గత 18 నెలలుగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. గోతుల వల్ల వర్షపు నీరు నిలిచి దోమలు పెరిగాయి. ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు కిందపడే ప్రమాదాలు పెరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.