ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డి. స్రవంతి, డా. పి. శ్రీలత రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని శుక్రవారం అనుపాకలో నిర్వహించారు. యూరియా అధిక మోతాదులో వాడొద్దని, అధికంగా వాడితే సాగు ఖర్చు పెరగడమే కాకుండా భూమిలో ఉన్న పోషకాల సంఖ్య తగ్గిపోతుందని శాత్రవేత్తలు వివరించారు. సాగు ఖర్చు తగ్గించుకొని అధిక లాభాలు పొందాలన్నారు.