కొత్తగూడెం జిల్లా అశ్వరావు పేట మండలం రామన్న గూడెంలోని గిరిజనులు రెవిన్యూ పరిదిలో ఉన్న సర్వే నెంబర్ 30, 36, 39 లో ఉన్న 573 ఎకరాల భూములను రెవిన్యూ అదికారులు, పారెస్ట్ అధికారులు తమకు రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఆ సర్వే నెంబర్ కి సంబంధించి భూముల యొక్క పూర్తి హక్కు పత్రాలు తమ వద్ద ఉన్నపటికి అధికారులు ఏ విధంగా స్పందించకపోవడంతో అధికారుల వద్దే తమ సమస్యను పరిష్కారించుకుంటామని బయలు దేరారు.