అశ్వరావు పేట మండలంలో ఆదివారం దురదపాడు గ్రామంలోని పాలగుంపులో నాలుగు పూరిల్లు పూర్తిగ కాలిపోయి ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాదితులకు యుటియం సంస్థ సభ్యులు అండగా నిలిచారు. ప్రమాదవశాత్తు కాలిపోయిన ఇండ్లలోని నాలుగు కుటుంబాలకు సోమవారం యుటియం పౌండర్ స్టీవెన్ దొర అద్వర్యంలో నిత్యవసర వస్తువులైన బియ్యం, కురగాయలు, వంటసామగ్రి, దుప్పట్లు, కిరణా సామగ్రి అందించడం జరిగిందని ఆయన చెప్పారు.