అశ్వరావుపేట: ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం

74చూసినవారు
తమ బాబు ప్రాణాలను కాపాడిన ఎమ్మెల్యేకు జీవితాంతం రుణపడి ఉంటామని అశ్వారావుపేట మండలం అచ్చుతాపురం గ్రామానికి చెందిన ఆవుల చెన్నారావు, విజయ దుర్గ దంపతులు తెలిపారు. తమ బాబు హార్ట్ సర్జరీకి నిమ్స్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి రూ. 5లక్షల ఎల్ఎసీ చెక్ అందజేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతగా సోమవారం గండుగులపల్లిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణను సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్