పేకాట శిబిరంపై దాడి

64చూసినవారు
పేకాట శిబిరంపై దాడి
దమ్మపేట మండలంలోని అఖినేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటరాజపురం శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు గురువారం దాడి చేశారు. వెంకటరాజపురం గ్రామ శివారులో పేకాట అడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ సాయికిశోర్ రెడ్డి దాడి చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు పారిపోయారు. వారి వద్ద నుంచి రూ. 10, 100 నగదు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్