భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, అఖినేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటరాజపురం గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు గురువారం దాడి చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు పారిపోయారు. వారి వద్ద నుంచి 10, 100 నగదు స్వాధీనం చేసుకొని, కేసునమోదు చేశామని ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి తెలిపారు.