మంగయ్య బంజరలో ఘనంగా బోనాల జాతర

59చూసినవారు
మంగయ్య బంజరలో ఘనంగా బోనాల జాతర
చండ్రుగొండ మండల పరిధిలోని మంగయ్య బంజర గ్రామంలో కొలువైన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం బోనాల జాతర వైభవంగా నిర్వహించారు. ఈ జాతరలో పరిసర గ్రామాల మహిళలు, పెద్దలు పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండి ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని అమ్మవారిని పూజించారు. ఈ ప్రత్యేక పూజల్లో గాంధీనగర్ గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్