అశ్వరావుపేటలోని మద్ది రామ గుడి సెంటర్లో వేంచేసి ఉన్న మద్దిరామ మహంకాళి అమ్మవారికి ఆషాఢ మాస బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా వీధుల్లో తిరిగారు. గ్రామదేవతలకు పసుపు, కుంకుమలతో పూజలు చేయగా, ఈ కార్యక్రమంలో మహిళల భాగస్వామ్యం అత్యధికంగా కనిపించింది.