రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే మూడు రోజుల్లో పూర్తికానుందని కొత్తగూడెం ఆర్డిఓ మధు అన్నారు. శుక్రవారం చండ్రుగొండ తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో చండ్రుగొండ మండలం సర్వేలో 4వ స్థానంలో ఉందన్నారు. అనంతరం భూ రికార్డులను పరిశీలించారు. తహశీల్దార్ సంధ్యారాణి ఆయన వెంట ఉన్నారు.