చండ్రుగొండ మండలం రేపల్లెవాడలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బుధవారం పర్యటించారు. ఇందిర బడిబాట కార్యక్రమం ద్వారా అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో సత్యనారాయణపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 1, 35, 000 మౌలిక వసతులను ప్రారంభించారు. అనంతరం రేపల్లెవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 1, 95, 000, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ. 9, 05, 000 తో డ్రింకింగ్ వాటర్, మరుగుదొడ్లు, విద్యుత్ మొదలగు మౌలిక వసతులను ప్రారంభించారు.