సోలార్ బోర్ వెల్ పంపుసెట్లను తమ గ్రామాలలో కూడా అమలు చేయాలని బీజేపీ చండ్రుగొండ మండల నాయకుడు గడ్డం శ్రీను ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు బుధవారం వినతిపత్రం అందించారు. పోకలగూడెం, వెంకట్య తండా గిరిజన గ్రామాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఈ గ్రామాల్లో కూడా అటవీ హక్కుల చట్టం ప్రకారం తమ పోడు భూములకు పట్టాలు కలిగి ఉన్న రైతులు ఉన్నారని గుర్తు చేశారు. సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.