పిల్లలకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి

70చూసినవారు
పిల్లలకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి
పిల్లలకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని చండ్రుగొండ ఎంపీడీవో అశోక్ ఆదేశించారు. బుధవారం మండలం లోని రావికంపాడులో  అంగన్వాడి, ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్లలో రికార్డును ప్రతిరోజు నమోదు చేయాలన్నారు. ఆరోగ్య కేంద్రంలోని ఏఎన్ఎంలకు ప్రతిరోజు జ్వరంతో కేంద్రానికి వచ్చిన వారికి తప్పనిసరిగా జ్వరం ఎక్కువగా ఉంటే రక్త పరీక్షలు చేయమన్నారు.

సంబంధిత పోస్ట్