దమ్మపేట మండలం అంకంపాలెం ఏకలవ్య పాఠశాలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పాఠశాల రికార్డులు పరిశీలించి ఉపాధ్యాయుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని పేర్కొన్నారు