దమ్మపేట మండలం పాకలగూడెంకు చెందిన తాతారావు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే ఆదినారాయణను కలిసి ఆర్థిక సాహయం చేయాలని కోరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి ఎల్ఓసీ చెక్కును మంజూరు చేయించారు. శుక్రవారం ఆ చెక్కును తాతారావు కుటుంబానికి ఎమ్మెల్యే అందజేశారు.