ధరణి వ్యవస్థ వల్ల ప్రజలు భూసమస్యలు ఎదుర్కున్నారని MLA జారే ఆదినారాయణ అన్నారు. సోమవారం దమ్మపేట మండలం ముష్ఠిబండలో జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు. భూముల రిజిస్ట్రేషన్లు, హక్కుల నిర్ధారణ, రికార్డుల వంటి కీలక అంశాల్లో స్పష్టత లేకపోవడంతో రైతులు భూస్వాములు ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమలు చేసిందని తెలిపారు.