దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామం నుంచి అశ్వారావుపేట వరకు ప్రజలతో కలిసి ఆర్టీసీ బస్సులో స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ ఆదివారం ప్రయాణించారు. అనంతరం ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా.. ఏవైనా సమస్యలు ఎదురవుతున్నాయా.. అని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే ఉచిత బస్సు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, విద్య, ఆరోగ్య పథకాలు వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు