దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణను మండల ఆలయ అర్చకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ధూప దీప నైవేద్యం కింద ఆలయ అర్చకుల సంక్షేమానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి అర్చకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.