దమ్మపేట మండలంలో జీసీసీ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మె 3వ రోజుకు చేరుకుంది. హమాలీ నాయకుడు భోగి సత్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 03-10-2024న జరిగిన ఒప్పందం ప్రకారం జీవో విడుదల చేసి వేతనాలు పెంచాలని పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు.