దమ్మపేట మండలంలోని పూసుకుంట గ్రామంలో తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని గ్రామస్థులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి బోరును మంజూరు చేయించారు. శనివారం ఆ బోరు పనులను స్థానిక అధికారులు ప్రారంభించగా గ్రామస్థులు మంత్రి తుమ్మలకు ధన్యవాదాలు తెలిపారు.