ఈనెల 18న తలపెట్టిన చలో ఇల్లందు ఆదివాసీల మహాగర్జన సభను విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారి సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం దమ్మపేటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మహాసభకు ఆదివాసీలు అందరూ వేలాదిగా తరలిరావాలని కోరారు. ఆదివాసీల ఐక్యతను చాటాలన్నారు. ఆదివాసీ చట్టాలను, హక్కులను కాపాడుకోవడానికి ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.