దమ్మపేట: ఆంగ్లంపై విద్యార్థులు పట్టు సాధించాలి
ప్రాథమిక విద్య దశలోనే ఆంగ్లంపై విద్యార్థులు పట్టు సాధించాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పేర్కొన్నారు. ఐటీడీఏ ప్రాథమిక పాఠశాలల కోసం రూపొందించిన ఉద్దీపకము పుస్తకాన్ని దమ్మపేట మండలంలోని గండుగులపల్లి గ్రామంలో ఆయన బుధవారం ఆవిష్కరించారు. ప్రాథమిక విద్య అనేది విద్యార్థి ఎదుగుదలను తీర్చిదిద్దేదన్నారు. ఈ దశలలోనే గణితం, ఆంగ్లం వంటి సబ్జెక్టులపై దృష్టి సారించేలా ఐటీడీఏ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.