జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

64చూసినవారు
జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ములకలపల్లి మండలం పూసుగూడెం పంప్ హౌస్ వద్ద గురువారం సీఎం పర్యటనను అడ్డుకునేందుకు వెళ్తున్న జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వాహనంలో వారిని పోలీస్ స్టేషనుకు తరలించారు. అక్రమంగా అదుపులోకి తీసుకోవడం సరికాదని, సీతారామ ప్రాజెక్టు నీటిని జిల్లాలోని ప్రతి మండలానికి అందించాలని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్