డీఎస్సీని వాయిదా వేయాలని దమ్మపేట మండల బీఆర్ఎస్ యువజన నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో బుధవారం మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని నాయకులు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.