దమ్మపేట ఆసుపత్రిలో సౌకర్యాలు పెంచాలి

63చూసినవారు
దమ్మపేట ఆసుపత్రిలో సౌకర్యాలు పెంచాలి
దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఈసీజీ, ఎక్స్-రే వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని కోరుతూ దమ్మపేట వైద్య అధికారికి ఆదివాసి రాష్ట్ర నాయకుడు తంబర్ల రవి వినతి పత్రాన్ని సోమవారం అందజేశారు. ప్రతిరోజు 100లా మంది వైద్య సేవల కోసం వస్తుంటారని, సరైన వైద్య సదుపాయాలు లేక దూర ప్రాంత ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. రోగుల ఇబ్బందులను గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్