దమ్మపేట మండలం రాచూరుపల్లి గ్రామ పంచాయతీ మల్కారం ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిపిడిఓ హేమసత్య జాతీయ జెండాను ఆవిష్కరించి స్థానిక ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను కొనసాగించాలని పేర్కొన్నారు.