ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

3994చూసినవారు
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు-లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్దకుమారుడు యశ్వంత్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఓ సబ్జెక్ట్ తప్పడంతో ఆరోజు నుండి యశ్వంత్ బాధపడుతున్నాడు. శనివారం వ్యవసాయ పనుల నిమిత్తం తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఎవరికి చెప్పకుండా ప్రక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్