దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పటికీ ప్రశాంత జీవనంతో వృద్ధాప్యాన్ని జయించవచ్చని భద్రాద్రి జిల్లా ఆయుష్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ మహేష్ గౌడ్ అన్నారు. స్థానిక ప్రభుత్వ హోమియో డిస్పెన్సెర్ ఆద్వర్యంలో ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ దీపికా నంద్యాల పర్యవేక్షణలో బుధవారం ప్రత్యేక వృద్దులు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీ వారం నిర్వహించే వైద్య శిబిరాన్ని స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.