భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో గురువారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్ స్టాండ్ ఆవరణలో కేక్ కటింగ్ చేసి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందనీ అశ్వారావుపేట మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సంక ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.