ములకలపల్లి జడ్పీ హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను గౌరవిస్తూ జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. విద్య ద్వారా సమాజానికి అందించిన సేవల గురించి గుర్తు చేశారు.