అశ్వరావుపేటలో నాగపంచమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమ, బియ్యపు నూకలతో పూజలు చేసి పాలు, గుడ్లు, బుర్రగుంజు వంటి నైవేద్యాలు నాగ దేవతలకు నివేదించారు. తమకు తమ బిడ్డలకు నాగదోషాలు తగలకూడదని, తమ సంతానం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు.