పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు

65చూసినవారు
పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు
ఆట పాటలతో పాటు విద్యలో కూడా ముందుండాలని వెంకటాయ్యతండా మాజీ సర్పంచ్, మాజీ ఉపసర్పంచ్ బాబూలాల్ విద్యార్థులకు సూచించారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చండ్రుగొండ మండలం వెంకటయ్యతండా పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీ విజేతలకు మాజీ ఉపసర్పంచ్ బానోత్ బాబులాల్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి హిందూ, హెచ్ఎం కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు రాములు స్వామి, రాంబాబు, రమేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్