కోనోకార్పస్ చెట్ల తొలగింపు

74చూసినవారు
కోనోకార్పస్ చెట్ల తొలగింపు
దమ్మపేటదో డివైడర్ పై నాటిన కోనోకార్పస్ మొక్కలను ఎట్టకేలకు పంచాయతీ సిబ్బంది మంగళవారం తొలగించారు. వారం రోజుల కిందట ఎమ్మెల్యే సమక్షంలో జరిగిన మండల ప్రత్యేక సమావేశంలో పలువురు ఈ మొక్కల వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర హాని జరుగుతుందని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఇన్ఛార్జి కార్యదర్శి సురేశ్ సిబ్బందితో వాటిని తొలగించారు. నూతన డివైడర్ పనులు పూర్తికాగానే మధ్యలో పూలమొక్కలను నాటి, పెంచుతామని కార్యదర్శి చెప్పారు.

సంబంధిత పోస్ట్