భారీ వర్షానికి కొట్టుకుపోయిన పెద్ద వాగు రింగు బండ

79చూసినవారు
అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులన్నీ నిండు కుండల్లా తలపిస్తున్నాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆదివారం ఉదయం పెద్దవాగు ప్రాజెక్టుకు మరో మారు గండి పడింది. ఇటీవల భారీ వర్షాలకు పెదవాగు ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసం అవ్వడంతో నీటిని నిల్వ చేయడం కోసం రింగు బండి ఏర్పాటు చేస్తున్నారు. కానీ రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాలకు క్యాచింగ్ ఏరియాలోకి వరద నీరు భారీగా రావడంతో సుమారు 30 మీటర్ల మేర రింగు బండ పూర్తిగా తెగిపోయి నీరు దిగువకు వెళ్లిపోతుంది.

సంబంధిత పోస్ట్