విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

56చూసినవారు
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
దమ్మపేట మండలం గండుగులపల్లిలోని ఏకలవ్య పాఠశాలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బుధవారం ఆఖస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులు బోధిస్తున్న విధానాన్ని స్వయంగా వీక్షించారు. పాఠశాల యాజమాన్యానికి ముఖ్యమైన సూచనలు చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనలో లోపం లేకుండా చూడాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్