భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండల పరిధిలోని తిప్పననపల్లి కి చెందిన ఎస్కే గిద్దె సాహెబ్ వ్యవసాయ కూలిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు తలెత్తడంతో రాంపురం అటవీ ప్రాంతంలో ఆదివారం చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. గమనించిన మేకల కాపరి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.