ములకలపల్లి కేజీబీవీ హాస్టల్ సమస్యలకు నిలయంగా మారిందని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి వరక అజిత్ గురువారం ములకలపల్లి తహసిల్దార్ కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ములకలపల్లి కేజీబీవీ లో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని, సరైన మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.