రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

52చూసినవారు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
దుమ్ముగూడెం మండలం కాటాయిగూడెం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భట్టిగూడెం గ్రామానికి చెందిన ముత్యాలరావు(42), జలకం సీతారాములు ఈనెల 3న బైక్ పై లక్ష్మీనగరం వచ్చి తిరిగి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొంది. ముత్యాలరావు తీవ్రంగా గాయపడడంతో ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

ట్యాగ్స్ :