డా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. జాన్ మిల్టన్ గురువారం ఓ ప్రకటనలో కోరారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఒకేషనల్ తత్సామాన అర్హత కలిగిన వారు దరఖాస్తు వేసుకోవచ్చన్నారు. డిగ్రీ ద్వితీయ ఏడాది చదువుతున్న విద్యార్థులు ఆగస్టు 15వ తేదీ లోపు ట్యూషన్ ఫీజు చెల్లించాలని కోఆర్డినేటర్ కామేశ్వరరావు తెలిపారు.