భద్రాచలం సబ్ డివిజన్ తపాలా శాఖ ఆధ్వర్యంలో గురువారం బిఆర్ కాలనీ పోస్ట్ ఆఫీసులో డిసీడీపీ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ పీఓఎస్బీ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సేవల గురించి వివరించారు. నేటి పోటీ ప్రపంచంలో తపాలా శాఖ గ్రామ ప్రజల కోసం గ్రామీణ చిన్న మొత్తాల పొదుపు, సేవింగ్ అకౌంట్ తదితర సేవలు అందిస్తోందని చెప్పారు. పోస్ట్ ఆఫీస్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.