భద్రాచలం రామాలయంలో నిర్వహించే నిత్య అన్నదాన కార్యక్రమానికి ఎటపాక వాస్తవ్యులు సూర్యనారాయణ మూర్తి, రాజు లక్ష విరాళాన్ని ప్రకటించారు. శుక్రవారం ఆలయ అధికారులకు దాతలు రూ.లక్ష విలువైన చెక్కును అందజేశారు. అనంతరం దాతలను ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు.