భద్రాచలం: ఆదివాసీ హక్కుల సాధనకు జేఏసీ ఏర్పాటు

73చూసినవారు
భద్రాచలం: ఆదివాసీ హక్కుల సాధనకు జేఏసీ ఏర్పాటు
భద్రాచలంలో ఆదివాసీ ప్రజా సంఘ అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీవో నెం. 3 పునరుద్ధరణ, ఎస్టీ వర్గీకరణ, మైదాన ప్రాంత గిరిజనులు అయిన లంబాడి, ఎరుకల, యానాది ఒక గ్రూపుగా విభజించాలన్నారు. ఎజెండా సాధించడానికి రాష్ట్రస్థాయిలో ఆదివాసీ ప్రజా సంఘ అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. ఈ జేఏసీకి సమన్వయకర్తగా చందా లింగయ్య దొరను ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్