సత్వర న్యాయ పరిష్కారమే లోక్ అదాలత్ ధ్యేయమని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21దిశగా రాజ్యాంగ స్పూర్తితో ఏర్పడిన లోక్ అదాలత్ ను కక్షిదారులు అందరూ ఉపయోగించుకోవాలని భద్రాచలం జ్యూడిషియల్ కోర్టు న్యాయమూర్తి జి. శివనాయక్ అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్‌అదాలత్ సందర్భంగా కక్షిదారుల కోసం బార్ అసోసియేషన్, ఎస్బిఐ, దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పులిహోర ప్యాకెట్ల కార్యక్రమాన్ని శివ నాయక్ ప్రారంభించి మాట్లాడారు.