భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అనుబంధ ఆలయం శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో పవిత్ర గోదావరి నదిలో గురువారం చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు సుదర్శన చక్రాన్ని గోదావరి నది వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. నేటితో బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు అర్చకులు తెలిపారు.