భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బుధవారం మాల మహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ అనుకూల తీర్మాణం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీర్మాణించడం భారత రాజ్యాంగాన్ని అవమానించడమే అని జిల్లా అధ్యక్షుడు దాసరి శేఖర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చదివారా అని ప్రశ్నించారు.