మెదక్, కరీంనగర్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ MLC చిన్నమైల్ అంజిరెడ్డి, సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి శనివారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం శ్రీ లక్ష్మీతాయారమ్మ వారి సన్నిధిలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఈ సంధర్బంగా భద్రాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారికి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.