పదవ తరగతి విద్యార్థులకు సమయానుకూలంగా మంచి విద్య బోధనలతో పాటు వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పాఠశాలలకు ఏమైనా రిపేర్లు ఉంటే వెంటనే చేయించే విధంగా స్పెషలాఫీసర్లు పాఠశాల హెచ్ఎంలు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. శుక్రవారం భద్రాచలం ఐటిడిఏ సమావేశ మందిరంలో స్పెషలాఫీసర్లు హెచ్ఎం వార్డెన్ లతో పాఠశాలల పర్యవేక్షణ నిర్వహణ తీరుపై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.